calender_icon.png 15 February, 2026 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

15-02-2026 06:16:06 PM

లింగాపూర్,(విజయక్రాంతి): లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి, ఖిమానాయక్ తాండ, మోతిపటర్, పీక్లనాయక్ తాండ, రామునాయక్ తాండ గ్రామాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి తాండాలో సేవాలాల్ మహారాజ్ జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్, అన్నదాన కార్యక్రమాలు చేపట్టగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయక్ కారోబారి డావ్ పూజారి, మంగులాల్ రాథోడ్, కిరణ్ నాయక్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.