calender_icon.png 15 February, 2026 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

15-02-2026 06:19:59 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఆదివారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షులు దేవిసోత్ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి జగదంబా దేవి, సేవలాల్ మహారాజ్ మందిరం వద్ద బోగ్ భండార్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ...గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.గిరిజన సమాజానికి దారి చూపిన మహనీయుడు గిరిజనులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపి వారి జీవన విధానంలో మార్పు తెచ్చిన దైవాంశ సంభూతుడు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వరిజ నాయక్,గిరిజన మండల నాయకులు తండావాసులు తదితరులు పాల్గొన్నారు.