సర్‌ను బాధ్యతాయుతంగా నిర్వహించాలి: డీసీసీ అధ్యక్షుడు
దామరచర్ల, జూలై 21 : ‘సర్‘ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత అన్నారు, ప్రతి అర్హులైన ఓటరును గుర్తించి వారి వివరాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. దామరచర్ల ,వాడపల్లి గ్రామాల్లో బి ఎల్ ఏ లు ఎన్యుమరేటర్ ఫామ్స్ కు సంబంధించి సేకరిస్తున్న వివరాలని పరిశీలించిన అనంతరం బిఎల్‌ఎలు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు మూడో తేదీ వరకు గడువు పొడిగించారని నిర్లక్ష్యం తగదని , సాధ్యమైనంత మేరకు ఈ నెల 30 లోపు ఓటరు జాబితాలకు సంబంధించి బిఎల్‌ఎలు సంపూర్ణంగా పనిచేయాలని కోరారు.సి ఎం రేవంత్ రెడ్డి , పిసీసి అధ్యక్షులు మహేష్ కుమార్ ల ఆదేశాల మేరకు ఆగస్టు మూడో తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఎల్‌ఏలు గ్రామాలను పట్టణాలను వదిలి వెళ్ళకుండా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చురుకుగా పూర్తి చేయాలని కోరారు.
తద్వారా ప్రజాస్వామ్యం రక్షణలో ఓటర్ల హక్కులను కాపాడిన వాళ్ళుగా నిలబడతామని అన్నారు. 2029 లో మళ్లీ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ SIR ఇంచార్జ్ షబ్బీర్ ఆలీ, మండల అధ్యక్షుడు గాజుల శ్రీను, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పరమేష్, డిసిసి సెక్రటరీ పగిళ్ళ రాజు, నాగు నాయక్ ,కోటిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...






