ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
ఆర్మూర్, అక్టోబర్31 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆదేశానుసారం బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఉదయ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150.వ జయంతి వేడుకలు ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అరిపించారు.
అనంతరం బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యతకు పాటుపడిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో అంతర్గా అంతర్భాగం కానీ రోజు హుకుం జారీ చేసి నిజాం రాజును తరిమికొట్టిన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలో విలీనం చేస్తూ మనకు స్వతంత్రం ఇచ్చినటువంటి మహోన్నతవ్యక్తిని గుర్తు చేస్తూ ఆ వ్యక్తి అడుగుజాడల్లో నడివి ఆశ యం కోసం పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బిజెపి పట్టణాధ్యక్షుడు మందుల బాలు, నూతల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి జిల్లా నాయకులు పోల్కం వేణు, జెస్సు అనిల్, బాసెటి రాజ్ కుమార్, కలిగోట ప్రశాంత్, కిరణ్, వంశీ సృజన్, పెద్దల భరత్ బండి, రాము, గోపి, బిజెపి నాయకులు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.






