calender_icon.png 1 November, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత అధ్యయన కేంద్రంపై నిర్లక్ష్యం

01-11-2025 12:00:00 AM

ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని హైమత్ నగ ర్‌లో మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలి పారు.

శుక్రవారం దళిత అధ్యయన కేం ద్రాన్ని మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, రసమయి బాలకిషన్, రాజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆనాడు రూ.24 కోట్ల తో నిర్మిస్తే.. ప్రస్తుత సీఎం, మంత్రి, అధికారులు ఇప్పటి వరకు కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దారుణమన్నారు. అన్ని వర్గాలను వంచించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తించాలని కోరారు.