15 April, 2026 | 9:36 AM

ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు

07-02-2026 08:31 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలకపి సంస్థ ఎన్నికల నిర్వహణ లో బాగంగా మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.  కరీంనగర్ నగరపాలక సంస్థ  66 డివిజన్ కు చెందిన ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి నగరపాలక సంస్థ అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పించింది.

శనివారం నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరపాలక సంస్థలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... నగరపాలక సంస్థ లో ఓటర్లుగా ఉండి ఎన్నికల విధులు నిర్వర్తిస్తన్న ప్రభుత్వ ఉద్యోగులు మిగిలిన రెండు రోజుల్లో తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేస్కోవాలన్నారు. 8న  ఉదయం 8:00 నుండి సాయంత్రం 8:00 గంటల వరకు ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.