calender_icon.png 8 December, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్@ స్టేటస్

08-12-2025 12:00:00 AM

-గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

-పాటలు వాయిస్‌తో జనాలకు షేర్

నిర్మల్, డిసెంబర్ ౭ (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. నిర్మల్ జిల్లాలో ఈనెల 11న మొదటి దశ, 14న రెండవ దశ, 17న మూడవ దశ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టారు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ పార్టీ మద్దతుతో పాటు స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులు ఆయా గ్రామాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు.

నిర్మల్ జిల్లాలో మొత్తం 400 గ్రామపంచాయతీలు 3,362 వార్డు సభ్యులు ఎన్నికలు జరగనుండగా ఇప్పటికీ ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గం 45పైగా సర్పంచులు 100 పైగా వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎన్నికల కమిషన్ పార్టీ అభ్యర్థులకు గుర్తులు ప్రచారం చేయడంతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులు ఈసారి నేరుగా ఓటర్ల ప్రసన్నతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఆ పార్టీ అభ్యర్థుల జీవనశైలి ఎన్నికైతే ఏం చేస్తారో వివరిస్తూ రాజకీయ నియమత్యం గతంలో పాలకుల వైఖరి ఎందుకోసం పోటీ చేస్తున్నాను వివరిస్తూ వారి గుర్తులను సోషల్ మీడియాలో పెట్టి వీడియో ఆడియో కాల్‌లో మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆ పార్టీ మద్దతుదారులంతా అభ్యర్థితో పాటు ప్రతిరోజు ఒక వీడియో ఒక ఆడియో తయా రు చేయించి స్టేటస్ పెట్టుకోవడం గ్రామంలోని గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు.

వ్యక్తిగతంగా పాటలను ప్రచారాన్ని తయారు చేసుకొని సోషల్ మీడియాను వాడుతున్నారు. దీంతో నిర్మల్, బైంసా, ఖానాపూర్ తదితర పట్టణాల్లో స్టేటస్‌కు సంబంధించిన సోషల్ మీడియా ప్రచార కేంద్రాల వద్ద పోటాపోటీగా ప్రచార సంబంధించిన లింకులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం ఒక తీరు మధ్యాహ్నం మరో తీరు సాయంత్రం ఇంకో తీరు స్టేటస్లు మార్చి కొత్త కొత్త ఆలోచనలు ప్రజలపై రుద్దుతున్నారు.

రాత్రి సమయంలో మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి సర్పంచ్ అభ్యర్థితోపాటు వార్డు సభ్యులను గెలిపించేందుకు ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. గతంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామానికి చెందిన అభ్యర్థి పాడు ఆయన మద్దతుదారులు ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ పత్రాలు చూయించి ఓటు అభ్యర్థించే సంప్రదాయం ఉండే.

ఇప్పుడు అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఇద్దరు సభ్యులు ఉంటే అందరి కి స్మార్ట్ ఫోన్లు ఉండడంతో వారి నంబర్లను సేవ్ చేసుకొని గ్రూపు గ్రూపులుగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం గ్రామంలో కొందరు యువకులు సోషల్ మీడియాతో మంచి పట్టున వారిని ఎంపిక చేసుకొని ప్యాకేజీలను కూడా ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

గతంలో గోడలపై రాతలు డోర్ స్టిక్కర్లు పాంప్లెట్ కాగితాలు కరపత్రాలు వినియోగించుకునే సంప్రదాయం ఉండగా ఎన్నికల్లో ట్రెండ్ మాత్రం సోషల్ మీడియా స్టేటస్ గా మారిపోయింది. ఫోన్లో ఏ స్టేటస్ చూసినా ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ వార్డు సభ్యుల సంబంధించిన ఎలక్షన్ల స్టేటస్ కనిపించడంతో గ్రామపంచాయతీ ఎన్నికలను సోషల్ మీడియా ప్రచారం శాసస్తుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు.