4 May, 2026 | 12:29 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

చిట్టి పైసలు ఎగ్గొట్టిన సర్పంచ్ భర్త

06-03-2026 02:26 AM
  1. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

సర్పంచ్ ఇంటి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన

మెదక్ జిల్లా పోతారంలో ఘటన

బాధితులతో రూ.6 లక్షలకు ఒప్పందం?

మెదక్, మార్చి 5 (విజయక్రాంతి): సర్పంచ్ భర్త వద్ద తాను వేసిన చిట్టి అయిపోయి, నాలు గు నెలలు గడుస్తున్నా తనకు రావాల్సిన రూ. 50 వేలు ఇవ్వడం లేదని, తనకు ఆరోగ్యం సరి గ్గా లేదని చెప్పినా ఇబ్బంది పెడుతున్నాడని మనస్తాపం చెందిన వ్యక్తి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం గంగయ్యపల్లి గ్రామంలో జరిగింది. గంగయ్యపల్లి గ్రామానికి చెందిన మన్నె శ్రీశైలం యాదవ్(40) వ్యవసాయ పను లు చేస్తుండగా.. భార్య రజిత గ్రామ శివారులోని సీడ్ కంపెనీలో పనికి వెళ్తుంది. వీరికి ఇద్దరూ పిల్లలు ఆకాంక్ష, అఖిల ఉన్నారు.

మనోహర్‌బా ద్ మండలం పోతారం గ్రామ సర్పంచ్ వినోద భర్త మహేందర్ వద్ద శ్రీశైలం చిట్టి వేశాడు. చిట్టి పూర్తి అయి నాలుగు నెలలు కావస్తున్నా తనకు రావాల్సిన రూ.50 వేలు ఇవ్వడం లేదు. ఆరో గ్యం సరిగ్గా లేదని చెప్పినా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీశైలం తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్ట డంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు.

దీంతో ఆగ్రహించిన గంగయ్యపల్లి గ్రామస్థులు పోతారం వెళ్లి సర్పంచ్ వినోద ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. శ్రీశైలం కు టుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మృతదేహాన్ని వ్యవసాయ పొలం నుంచి తీసుకెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సర్పంచ్ భర్త మహేందర్‌పై చర్యలు తీసుకున్న తర్వాతే అంత్యక్రియలు చేస్తామని తెలిపారు.

దీంతో సర్పంచ్ భర్త మహేందర్ ఆందోళనకారులతో ఒప్పందానికి వచ్చాడు. బాధిత కుటుంబానికి రూ.ఆరు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. మొదటగా లక్ష రూపాయలు అందజేశాడు. మరో ఐదు లక్షలను నెలనెలా ఒక లక్ష రూపాయల చొప్పున ఇస్తామని లిఖితపూర్వకంగా బాండ్ రాసి ఇచ్చినట్లు తెలిసింది.