13-01-2026 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి12(విజయక్రాంతి): గిరిజన లంబాడి సంఘాల జాయిం ట్ యా క్షన్ కమిటీ జి.ఎల్.ఎస్ జెఏసి ఆధ్వర్యంలో గిరిజన లంబాడి సర్పంచ్-ఉప సర్పం చ్ ల స న్మాన మహోత్సవ అభినందన సభ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ చైర్మన్ అధ్యక్షతన సో మవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎ మ్మెల్యే కునంలేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ.. నూతన సర్పంచ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి సర్పం చ్లు తండాల అభివృద్ధికి కృషి చేయాలని దేశ సమాగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిం చి గ్రామపంచాయతీలో పాలుపంచుకోవాలని, ప్రతి సమస్యను దగ్గరుండి సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని అన్నా రు.
జీఎల్‌ఎస్ జాక్ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. తండా పంచాయితీని తండా అభివృద్ధి బోర్డుగా ఏర్పాటు చే యాలని, తండా పంచాయితీని రెవిన్యూ పం చాయితీగా గుర్తించాలని, ఏజెన్సీ చట్టాలను, జిఓ 3 స్థానంలో కొత్త జిఓ రావడంలో సర్పంచ్ లు భాగస్వామ్యం కావాలని అ న్నారు. గిరిజన చట్టాలైన పెస చట్టం, పరిరక్షణ ఏజెన్సీలో 100 % రిజర్వేషన్ల విద్యా ఉ ద్యోగాల్లో గిరిజన్లో వాటా వారికి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీలోని యువత గంజాయికి బానిస కాకుండా చూడాలని గంజా యి మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, ఎల్ హెచ్ పీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గూగులోతు రాజేష్ నాయక్, జాక్ సెక్రటరీ జనరల్ రమేష్, న్యాయవాది బానోత్ రమేష్ నాయక్, వైస్ ఛైర్మన్ లు లావుడియా ప్రసాద్ నాయక్, మాలోత్ విగ్నేష్ నాయక్, లాకావత్ వెంకటేశ్వర్లు, బట్టు జుంకీలాల్ నాయక్ , బోడా లాలు నాయక్, గూగులోతు కృష్ణ నాయక్, భూక్యా వెంకట్ నాయక్, హథీరాం నాయక్, జీ .శ్రీనివాస్ నాయక్, జేఏసీ అధికార ప్రతినిధిలు రవి రాథోడ్ ,లావూరి శ్రీనివాస్ నాయక్, చుంచుపల్లి మండలం మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి బాయి, బాదావత్ సీతారాం, ధరావత్ ప్రేమ్ చంద్ నాయక్, నాయక్ ,GLS -JAC కోశాధికారి మంగీలాల్ నాయక్, జనరల్ సెక్రటరీ మోహన్ నాయక్, గూగులోతూ దేవిలాల్ నాయక్, జాక్ ప్రధాన కార్యదర్శులు నునావత్ రాంబాబు నాయక్, సురేష్ నాయక్, దుర్గాప్రసాద్ నాయక్తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది లంబాడి సర్పంచులు ఉపసర్పంచ్లు పాల్గొనగా వారిని సన్మానించారు.