2 April, 2026 | 9:44 AM

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

07-12-2024 06:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న వంట కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమేష్ అన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని గత నాలుగు రోజులుగా కార్మికుల సమ్మె చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి గౌరవించాలని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీభూదేవి, భోజన్న, గంగామణి పాల్గొన్నారు.