సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
మన్నె గోవర్ధన్ రెడ్డి
బంజారాహిల్స్, ఆగస్టు 18 (విజయక్రాంతి): చరిత్ర పుటల్లో మొఘలులకు వ్యతిరేకంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవనులో మంగళవారం జరిగిన సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని గుర్తు చేసుకున్నారు. బహుజనవీరుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి ఆయన చేసిన పోరాటం ఎనలేనిదని కొనియాడారు. బహుజన ఆత్మగౌరవ ప్రతీక పాపన్న గౌడ్ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






