3 March, 2026 | 6:32 AM

‘పది’ విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

03-03-2026 12:00 AM

బూర్గంపాడు, మార్చి 2 (విజయక్రాంతి): మండల పరిధిలోని సారపాక ప్రగతి విద్యానికేతన్లో 2001-2002 పదవతరగతి చదివిన పూర్వ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో సోమవారం పరీక్షా సామాగ్రి (ప్యాడ్లు, కంపాస్లు, పెన్నులు)పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన పదవతరగతి విద్యార్థులకు పూర్వ విద్యార్థులు తమవంతుగా రూ.20వేలు వరకు ఫీజు చెల్లిస్తామని తెలిపారు.

అంతేకాకుండా భవిష్యత్లో పూర్వ విద్యార్థులందరం పాఠశాలలో చదివే విద్యార్థుల సౌకర్యార్థం సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసన్న, డైరెక్టర్ సానికొమ్ము చైతన్యరెడ్డి (చైతన్య), హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు స్వర్ణలత, పూర్వ విద్యార్థులు శ్రీనివాసరెడ్డి, అక్షర్, రాజా తదితరులు పాల్గొన్నారు.