18 April, 2026 | 11:37 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వినోదం పంచే సతీ లీలావతి

23-06-2025 01:05 AM

నేటి కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీన పడుతోంది. అందుకు కారణం మనుషుల మధ్య భావోద్వేగాలు లేకపోవటమే.. భావోద్వేగాలే బంధాలను కలకాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య భావోద్వేగం ఇంకెంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి సునిశితమైన అంశాన్ని తెరపై హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు తాతినేని సత్య.

ఆ ప్రయత్నంలో భాగంగా రూపుదిద్దుకుంటున్నదే ‘సతీ లీలావతి’ చిత్రం. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం అని టీమ్ పేర్కొంటోంది. లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్‌మోహన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న టీమ్ తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; మాటలు: ఉదయ్ పొట్టిపాడు; ఆర్ట్: కోసనం విఠల్; కెమెరా: బినేంద్ర మీనన్; ఎడిటర్: సతీశ్ సూర్య.