calender_icon.png 1 August, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట్లాది విలువ చేసే సర్కార్ స్థలాన్ని కాపాడండి

31-07-2025 12:00:00 AM

న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీవాసుల విజ్ఞప్తి 

నిజామాబాద్ జూలై 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ లోని వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనిలో కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జ చేస్తున్నారని కబ్జాదారుల నుండి విలువైన స్థలాన్ని కాపాడాలని కాలనీవాసుల సంక్షేమ సంఘం జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేసింది. 

ఈ మేరకు సంఘం అధ్యక్షులు దాసరి లక్ష్మి నర్సయ్య,ప్రధాన కార్యదర్శి బాలసింగ్ నాయక్ చౌహన్,ఉపాధ్యక్షుడు కంచెట్టి లక్ష్మణ్,  సహాయ కార్యదర్శి రేకులపల్లి కమలాకర్ రెడ్డి,కోశాధికారి ఏనుగు హన్మంత్ రావు, సలహాదారు, ఇంజనీర్ ఎస్. శివలాల్ తదితరులు బుధవారం నాడు నుడ చైర్మన్ కేశ వేణు ను కలిసి ఫిర్యాదు చేశారు. వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ LIG ఇండ్లకు పక్కన 2వేల500 గజాల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో నుడా చైర్మన్ కేశవ ఏనుగు  కోరారు.

కాలనీ వాసుల భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన విలువైన స్థలంలో కొందరు ప్రవేట్ వ్యక్తులు కార్ గ్యారేజ్ అవసరాల కోసం వాడుకుంరున్నారని సంక్షేమ సంఘం నేతలు కేశ వేణు దృష్టికి తెచ్చారు. పార్క్ కోసం వినియోగించడానికి వీలుగా చెట్లు పెంచి ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నాలను ప్రయివేటు వ్యకులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు..

ఖచ్చితమైన కొలతలు నిర్వహించి 2500 గజాల స్థలం చుట్టూ కంచె వేసి ప్రజల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల చెర నుండి విడిపించాలని నుడ చైర్మన్ ను కోరారు. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుపై కేశ వేణు స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన నుడ చైర్మన్ హౌసింగ్ బోర్డు లో ఖాళీ స్టలంను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.