calender_icon.png 2 August, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఏర్పాట్లు

31-07-2025 12:00:00 AM

- 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఆగస్టు 3న మంత్రుల పర్యటనకు అవకాశం

- ప్రారంభ ఏర్పాట్ల పరిశీలనలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కలెక్టర్

పెద్దపల్లి, అంతర్గాం, జూలై-30 (విజయ క్రాంతి) అంతర్గాం మండలం ముర్మురు లో ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని  రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష లు అన్నారు.బుధవారం వారు అంతర్గాం మండలంలోని గోలివాడ లో క్రీడా ప్రాం గణం, అంబేడ్కర్ చౌరస్తా మైదానంలో రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి చేస్తున్న ఏర్పాట్లను స్థానిక , అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తో కలిసి మాట్లాడుతూ అంతర్గాం మండలం ముర్మూరు ప్రాంతంలో ఎస్సారెస్పీ కాల్వలు 17ఎల్, 27 ఎల్ క్రింద పాలకుర్తి ,అంతర్గం మండలం లో ఉన్న 13,386 ఎకరాల చివరి ఆయకట్టు భూములకు స్థిరీకరణ కోసం నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకం పూర్తయిందని, ఈ ప్రాజెక్టును నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, ఈఈ ఎల్లంపల్లి స్వామి, తహసిల్దారులు తూము రవీందర్ పటేల్, ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.