calender_icon.png 31 July, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపితోనే గ్రామాల అభివృద్ధి

30-07-2025 11:37:21 PM

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ అరిగేలా నాగేశ్వరరావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిజెపితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు(District Convener Arigela Nageshwar Rao) అన్నారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఆసిఫాబాద్ మండలం బూరుగుడా గ్రామానికి చెందిన 100 మంది ఆయన సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని స్పష్టం చేశారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు అత్యధికంగా కేంద్రం నిధులతోనే చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీని సంస్థగతంగా బలోపేతం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దీపక్ ,జయరాజ్ ,సుగుణాకర్, ప్రసాద్ గౌడ్ ,ప్రహ్లాద్ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.