13 March, 2026 | 3:40 PM

సే నో టు డ్రగ్స్ అవగాహన ర్యాలీ

13-03-2026 12:00 AM

దమ్మపేట, మార్చి 12,(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ జారే మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు. 

ఈ కార్యక్రమంలో పలువురు సే నో టు డ్రగ్స్ పై పాఠశాలలో విద్యార్థులకి తెలియజేసి తదనంతరం విద్యార్థులతో మాట్లాడించి, వారికి సన్మానం చేశారు. నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యార్థులకు ఆటలు ఆడుకోవడానికి స్పోరట్స్ కిట్ అందజేశారు.

మాదక ద్రవ్య దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి సమావేశములో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ‘డ్రగ్స్ కు నో చెప్పండి‘ అనే నినాదంతో అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే, అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాం నరేష్ యాదవ్, నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి, దమ్మపేట ఎస్త్స్ర సాయి కిషోర్ రెడ్డి,  సివిల్ అసిస్టెంట్ సర్జన్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.