13 March, 2026 | 6:10 PM

కంటోన్మెంట్ సీఈవోతో ఎమ్మెల్యే భేటీ

13-03-2026 12:00 AM

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు సీఈవో అర వింద్ కుమార్ ద్వివేదితో గురువారం ఎమ్మె ల్యే శ్రీగణేష్ బోర్డు కార్యాలయంలో భేటీ అయ్యారు. రంజాన్ పండుగ నియోజకవర్గంలో ముస్లింలు ఆనందంగా పండుగను జరుపుకునేలా అన్ని దర్గాలు, మజీద్‌లు, వీధులన్నీ శుభ్రంగా ఉండేలా, వీధి దీపాలు అన్ని పూర్తి స్థాయిలో వెలిగేలా, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ అన్నీ క్లీన్‌గా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు.

వేసవిలో నియోజకవర్గ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా పాడైపోయిన బోర్లను బాగు చేయించాలని, అవసరమైన చోట కొత్త బోర్లు వేయించి సక్రమంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే సూచించారు. సీఈవో సంబధిత అధికారులకు వెంటనే తన కార్యాలయంలో ఎమ్మె ల్యే సమక్షంలోనే తగిన ఆదే శాలు జారీ చేసి, పనులను వెంటనే చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో హెల్త్ వాటర్ డిపార్ట్మెంట్‌ల అధికారులు దేవేందర్, శశాంక్ పాల్గొన్నారు.