1 August, 2026 | 2:51 AM

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలు

01-08-2026 01:28 AM

రామారెడ్డి పోలీసుల చాకచక్యంతో ఇద్దరు నిందితుల అరెస్టు రిమాండ్

రూ.15 వేల నగదు, HP ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం

ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, జూలై 31 (విజయక్రాంతి): వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ తో మోసం చేస్తున్న ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్  శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్  రామన్, రామారెడ్డి ఎస్‌ఐ మురళి నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ వచ్చిన సమాచారాల మేరకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ప్రధాన నిందితుడు భూక్య నవీన్ @ నరేష్ విదేశాల్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో Future9.com అనే ఆన్లైన్ గేమింగ్ వ్బుసైట్కు సంబంధించిన వివరాలు, మొబైల్ నంబర్ల డేటాను సేకరించినట్లు వెల్లడించాడు.

భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం వాట్సాప్ ద్వారా పలువురికి ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపించి, ‘పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి‘ అని నమ్మించి ఆన్లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తెలిసిందన్నారు. నిందితులు బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వ్బుసైట్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేవారు. వ్బుసైట్లో నేరుగా చెల్లింపులు జరగని సందర్భాల్లో తమ యూపీఐ (QR కోడ్) ద్వారా నగదు స్వీకరించి సంబంధిత వ్బుసైట్లో జమ చేసేవారు.

ఇందుకు ప్రతిఫలంగా వారికి 5 శాతం కమిషన్ అందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ వ్బుసైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. రామారెడ్డి మండలానికి చెందిన భూక్య నవీన్ అలియాస్ నరేష్,    భూక్యా ప్రవీణ్ నుంచి  HP ల్యాప్టాప్-1,   మొబైల్ ఫోన్లు-4,   రూ.15,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు..   ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్  శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్  రామన్,  రామారెడ్డి, SI మురలి, సైబర్ క్రైమ్ ఎస్ ఐ నరేష్ సిబ్బంది అందరినీ  జిల్లా ఎస్పీ  అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ... ‘ప్రజలు ఆన్లైన్ గేమింగ్, పెట్టుబడులు, ట్రేడింగ్, పార్ట్టైమ్ ఉద్యోగాలు, క్యాష్బ్యాక్, రెట్టింపు లాభాలు వంటి పేర్లతో సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మాధ్యమాల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు ఆన్నారు.

తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్బుసైట్లు, యాప్లు, వ్యక్తుల మాటలను గుడ్డిగా విశ్వసించి నగదు పంపించడం వల్ల ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏదైనా వ్బుసైట్ లేదా యాప్లో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయతను పూర్తిగా నిర్ధారించుకోవాలి అన్నారు.   ఒకవేళ ఆన్లైన్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వ్బుసైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి. అలాగే సమీప పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేస్తే, సకాలంలో చర్యలు తీసుకుని బాధితులు కోల్పోయిన నగదును హోల్  పెట్టి  తిరిగి వచ్చేలా చేసే అవకాశాలు ఉంటాయన్నారు.