calender_icon.png 15 July, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులవృత్తులకు చేయూతనిచ్చేలా సంక్షేమ పథకాలు

15-07-2025 12:00:00 AM

పీఎం విశ్వకర్మ పథకం శిక్షణ సర్టిఫికెట్లను అందజేసిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్, జూలై 14 (విజయక్రాంతి ): కుల వృత్తిదారుల ఆదాయాన్ని పెంచి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీ గోడం నగేష్ అన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ వృత్తి నైపుణ్యం శిక్షణ పొందిన వారికి సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాజంలో ఉన్న అన్ని కుల వృత్తి లకు చెందిన వారికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి వృత్తి నైపుణ్యం ఇచ్చి వారికి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించి శిక్షణనిస్తోందని, శిక్షణా తరగతులను సద్విని యోగం చేసుకుని తమ నైపుణ్యాన్ని పెం పొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు తాటిపెళ్లి రాజు, సుభాష్, ప్రవీణ్, కృష్ణ, గంటా సురేష్, చంద్రకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు