22 May, 2026 | 1:50 AM

త్వరితగతిన పాఠశాల నిర్మాణ పనులను చేయాలి

22-05-2026 01:14 AM

జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి

కేసముద్రం, మే 21 (విజయక్రాంతి): కేసముద్రం మండలం అర్పనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను జిల్లా విద్యాధికారి ఏ. సత్యనారాయణమూర్తి కోరారు. పాఠశాల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రీ ప్రైమరీ, 8వ తరగతి నిర్వహణకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.

జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల కోసం నాలుగు తరగతి గదులను త్వరితగతిన సిద్ధం చేయాలని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అన్ని హంగులతో నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి, పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని డిఇఓ సత్యనారాయణమూర్తి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి,కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.