22 May, 2026 | 1:50 AM

టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జిగా డాక్టర్ శ్రీకాంత్

22-05-2026 01:17 AM

నియోజకవర్గ ఇంచార్జిగా గందసిరి వేణు

మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన (టీ ఆర్ ఎస్)పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగల నిర్వహణ కోసం జిల్లా ఇంచార్జిలను, నియోజకవర్గాల ఇంచార్జీలను  ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత  ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జ్ గా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ను నియమించారు.

శ్రీకాంత్ గౌడ్ జాగృతి సంస్థ నుండి కవితకు విధేయుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో మానుకోట జిల్లా ఇంచార్జ్ గా కవిత శ్రీకాంత్ గౌడ్ కి అవకాశం ఇవ్వటానికి దోహద పడింది. అలాగేమానుకోట నియోజకవర్గ ఇంచార్జి గా గంధసిరి వేణు ను నియమించారు.  ఇక జిల్లాలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి గా బోడ అనిల్ నాయక్ ను నియమించారు. జిల్లాలో ప్రతి గ్రామ గ్రామానా పార్టీ జెండా ఎగిరేలా రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ బాధ్యులు పనిచేయనున్నారు.