22 June, 2026 | 10:59 PM

స్కూళ్ల ట్రెండ్.. పిల్లలకు డేంజర్?!

25-11-2025 12:00 AM

-ప్రైవేట్ విద్యాసంస్థల ఈవెంట్లు, ఆన్‌లైన్ బోధన, ఫన్ రీల్స్‌ను సోషల్ మీడియాలో పెడుతున్న యాజమాన్యాలు

-చిన్నారులకు పొంచి ఉన్న డీప్‌ఫేక్ ప్రమాదం

-హెచ్చరిస్తున్న నిపుణులు

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): విద్యా వ్యాపారమయం కావడంతో ఈ మధ్య హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవే ట్ విద్యాసంస్థలు కొత్తతరం ప్రచారాన్ని మొ దలుపెడుతన్నాయి. పబ్లిసిటీని పెంచుకునేందుకు టీచర్లు, సిబ్బంది తరచూ చేపట్టే క్లాస్ రూమ్ ఆక్టివిటీస్, సాంస్కృతిక ఈవెంట్లు, పాఠాల బోధనతోపాటు ‘ఫన్ రీల్స్’ను కూడా రికార్డ్ చేసి సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. ఇందులో విద్యార్థులను చూపించి, వీడియోలు, ఫొటోలు, రీల్స్ లాంటివి యూట్యూబ్, వాట్సాప్ లాంటి డిజిటల్ వేదికల్లో షేర్ చేస్తున్నారు.

పాఠశాలలు తమ పబ్లిసిటీని పెంచుకునేందుకు వీటి ని షేర్ చేస్తున్నప్పటికీ పిల్లల గోప్యతకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్) -ఆధారిత డీప్‌ఫేక్ టూల్స్ సులభంగా అందుబాటులోకి రావడం, సోషల్ మీడి యా కంటెంట్ అడ్డూ అదుపూ లేకుండా వ్యాప్తి చెందడం ఇప్పుడు ఆందోళన కల్గించే అంశం. విద్యార్థుల వీడియోలు, ఫొటోలు డీప్‌ఫేక్ బారిన ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీటిపై విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన లేకుండా పోవడంతో పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నించలేకపోతున్నారు. పిల్లల వీడియోలను ఆన్‌లైన్‌లో ఉంచడం ద్వారా వారి భవి ష్యత్ అంధాకారంలో పడే ప్రమాదం ఉం టుంది. పిల్లల వ్యక్తిగత వివరాలైన పాఠశాల ఉండే ప్రాంతం, యూనిఫాంలు, లేదా క్లాస్‌రూమ్ వంటి వ్యక్తిగత వివరాలు అనుకో కుండా సైబర్‌దాడులకు గురయ్యేలా చేస్తా యి. పిల్లల ఫొటోలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడి దుర్వినియోగమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కొన్ని పాఠశాలలు తల్లిదం డ్రుల సమ్మతితోనే సోషల్ మీడియాలో పో స్టులు చేస్తున్నప్పటికీ ఎవరైనా వీటిని డౌన్‌లోడ్ చేసుకుని ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాల జీతో దుర్వినియోగం చేయవచ్చని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా విద్యాసంస్థలు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.