16 April, 2026 | 1:40 PM

మహిళా సంక్షేమానికి పెద్దపీట

25-11-2025 12:00 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, నవంబరు 24 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమములో భాగంగా చొప్పదండి మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు, వ్యాపార రంగంలో మహిళలు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు శంకుస్థాపన...మండలంలోని రుక్మాపూర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక విద్యా సంస్థ రెండువేల కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలు, సదుపాయాలతో నిర్మించనున్నామని తెలిపారు. స్కూల్లో మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, శ్రీరాం మొండయ్య, అధికారులు, నాయకులుపాల్గొన్నారు.