24-11-2025 11:02:10 PM
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఆవిష్కరణలు, ఆంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్ల కోసం సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్(సీఐఐ సీఐఈఎస్) టి-హబ్‌లో ఐకాన్ సమిట్-2025ను సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రారంభ ప్రసంగం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు తరం సాంకేతికత, దాని పురోగతిని వివరించారు. సీఐఐ సీఐఈఎస్ సలహా మండలి చైర్మన్, ఆక్సిలర్ వెంచర్స్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, సీఐఐ ఉపాధ్యక్షురాలు డా.కె.సుచిత్రా ఎల్ల, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ కో-చైర్మన్ సీ.కే.రంగనాథన్ పాల్గొన్నారు.