26-05-2025 05:43:23 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Thoopran Municipal) పరిధిలోని వివిధ కాలనీలో బడిబాట కార్యక్రమన్ని ఎంపీపీఎస్ తూప్రాన్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం విద్యార్థుల ఇంటింటికి వెళ్లి మా పాఠశాల ప్రత్యేకతలను విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేసారు, అంతేకాకుండా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, కంప్యూటర్ శిక్షణ గురించి తెలియచేయడం జరిగిందన్నారు. ఐదు సంవత్సరాల పూర్తయిన విద్యార్థులను, ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగలరని విద్యార్థుల ఉద్యోగ భవితకు పునాదులు వేయాలని తల్లిదండ్రులతో వివరించారు.