17 April, 2026 | 7:03 PM

త్రాగునీరు లేక పొలాల వద్దకు వెళ్లి నీరు సేకరిస్తున్న తండావాసులు..

26-05-2025 05:40 PM

మాసాయిపేట్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) మాసాయిపేట్ మండల పరిధిలోని రామంతపూర్ తండాలో త్రాగునీరు లేక తాండ వాసులు పోలాల వద్దకు వెళ్లి త్రాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. గత వారం రోజుల నుండి తాండాలో నీటి ఎద్దడి ఏర్పడింది, వారం నుండి పలుమార్లు అధికారులతో మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదన్నారు. నీళ్లు లేక ఆమడ దూరంలో ఉన్న పొలాల వద్దకు వెళ్లి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వృద్ధులకు, చిన్న పిల్లలకు నీళ్లు లేక నానా యాతన పడుతున్నామని తాండ వాసులు ఆవేదన వ్యక్తపరిచారు.