20-12-2025 12:03:39 AM
హైదరబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): నగరంలోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఐఇఇఇ కమిటీ, హానోయో యూనివర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీ, వియత్నం ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ శుక్రవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్ణారెడ్డి, ప్రొఫెసర్ గుయేన్(డిప్యూటీ హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హానోయ్ వర్సిటీ ఆఫ్ ఇండస్ట్రీ, వియ త్నాం), ప్రొఫెసర్ అతుల్ నేగి (డీన్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, వర్సిటీ ఆఫ్ హైదరాబాద్), ప్రొఫెసర్ ఏ కృష్ణయ్య (వర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఓయూ) తదితరులు హాజరయ్యారు.
మొదటగా కాన్ఫరెన్స్ నిర్వాహకులు శివాని యాదవ్ కాన్ఫరెన్స్ పరిచయ ఉపన్యాసాన్ని ఇచ్చారు. కాన్ఫరెన్స్ కన్వీనర్ డాక్టర్ జి శ్రీలత ప్రారంభోపన్యాసాన్ని ఇచ్చారు. బాలకిష్ణారెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ప్రయో గాత్మకమైన విద్య అవసరమని చెప్పారు. నేడు కంప్యూటర్ రంగం అభివృద్ధి చెందితే అది అన్ని రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్రం కూడా 2047ను లక్ష్యంగా పెట్టుకొని రైజింగ్ తెలంగాణ పేరుతో అన్ని రకాల అభి వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని గుర్తుచేశారు.
కృత్రిమ మేధ వల్ల సైన్స్, టెక్నాలజీలలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని వివరించారు. గోయన్ థీ మాట్లా డుతూ సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకత విద్యార్థులు, రీసర్చ్ స్కాలర్లకు ఉందని చెప్పారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సెక్రట రీ, కరెస్పాండెంట్ కృష్ణారావు, మేనేజ్‌మెంట్ సభ్యులు రాకేష్‌రెడ్డి, ఆర్ ప్రదీప్‌రెడ్డి పాట్రన్స్‌గా వ్యవహరించనున్నారు.
కో ప్యాట్రన్స్‌గా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీఎల్ రాజు, డాక్టర్ ఏ వినయ బాబు (డీన్ అకాడమిక్స్), డాక్టర్ సత్యప్రసాద్ లంక(డీన్ ఇన్నోవేషన్ అండ్ ప్లానింగ్) వ్యవహరిస్తారు. కాన్ఫరెన్స్ జనరల్ చైర్ గా డాక్టర్ శివాని యాదవ్, కన్వీనర్స్‌గా డాక్టర్ జి శ్రీలత, డాక్టర్ కార్తీక్, డాక్టర్ పి నారాయణ వ్యవహరించనున్నారు.