20-12-2025 12:00:00 AM
జగిత్యాల, డిసెంబర్19(విజయక్రాంతి): మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జగిత్యాల జి ల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సి బ్బందిని అభినందించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారులు అందరు సమన్వయంతో పనిచేయ డం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిబంధనల కచ్చితమైన అమలు ఎన్నికల విజయానికి దోహదపడ్డాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.