calender_icon.png 20 December, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరుకు సిద్ధం

20-12-2025 12:06:15 AM

జగిత్యాల, డిసెంబర్19(విజయక్రాంతి): అర్బన్ మహిళా సంఘములు బ్యాంకు లింకే జీ రుణాలు మంజూరు చేయుటకు యూబీఐసిద్ధంగా ఉన్నది. అర్హులైన ఎస్ హెచ్ జి లకు సంబందించిన రుణ సౌకర్యంఈ నెల 24 తేదీలోపు పంపాలని డిప్యూటీ రిజనల్ హెడ్ శ్రీలత కోరారు. పి ఎంవీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకము క్రింద వీధి వ్యా పారులకు రుణాలు మంజూరికి సమర్పించిన దరఖాస్తులు పరిశీలించి వెంటనే మం జూరు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు.

గ్రూప్ రుణాలు లక్ష్యానికి అనుగుణ ముగా మంజూరి చేసిన రిసోర్స్ పర్సన్ లను అభినందించారు.మెప్మా ఏ ఓ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వీధి వ్యాపారులు రుణాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరి చేయాలనీ బ్యాంకర్లను కోరారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ యూ బి ఆ బ్యాంకు మేనేజర్లు భైరవ్ నాథ్, విశాల్, ప్రీతం, ప్రశాంత్, మె ప్మా టి ఎం సి రజిత, మెప్మా ఆర్ పిబ్ లు, డి ఈ ఓ మమతా తదితరులు పాల్గొన్నారు.