పంటల రక్షణకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి
15-08-2026 12:00 AM
ఎర్రవల్లి, ఆగస్టు 14: పంటల రక్షణకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. పి. అర్చన సూచించారు. వేముల, కొండపల్లి, మానవపాడు గ్రామాల్లో పత్తి, వరి, మిర్చి, బెండ, టమాటా, కంది పంటలను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు.
పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ సమతుల్య ఎరువులు, సమీకృత పురుగువ్యాధి నియంత్రణ పద్ధతులు పాటించాలని తెలిపారు. అధిక నత్రజని ఎరువులు, విచక్షణారహిత పురుగుమందుల వాడకాన్ని నివారించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.






