calender_icon.png 17 July, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవోదయ పరీక్షల ఫలితాలలో ఎక్సలెంట్ విద్యార్థులు

16-07-2025 10:24:42 PM

మణుగూరు,(విజయక్రాంతి): నవోదయ ప్రవేశ పరీక్షల ఫలితాలలో ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థులు రామటెంకి స్నితిక్, సాలెద్ర ప్రీతం యాదవ్ సత్తా చాటి, నవోదయ పాఠశాలలో సీటు సాధించారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. స్కూల్ చైర్మన్ ఎండీ యూసఫ్ షరీఫ్ మాట్లాడుతూ... కృషి ఉంటే తప్పక ఫలితం వస్తుందన్నారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు నవోదయకు ఎంపిక కావడంపట్ల  డైరెక్టర్స్ ఎండి యాకుబ్ షరీఫ్, ముక్కు నర్సారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.