16-07-2025 10:28:14 PM
మునగాల: పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మీకు బరోసా కల్పించడానికి వచ్చాం అంటూ బాలికలకు సామాజిక అంశాలు, చదువుల ప్రాముఖ్యత, విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, ఆకర్షణల, బాలికలకు దృడ సంకల్పం, మానసిక దైర్యం, వేధింపులపై పిర్యాదు చేయడం, సమస్యలను ఉపాధ్యాయులకు తెలియజేయడం అంశాలపై అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ... బాలికలు మానసిక సంకల్పము, మానసిక దృఢత్వం, మానసిక ధైర్యము కలిగి ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కొని నిలబడాలి అన్నారు. ఎవరైనా వ్యక్తులు బాలికలను, విద్యార్థులను తాకుతున్నట్లయితే అది ప్రేమగా తాకుతున్నారా, చెడు ఉద్దేశ్యంతో తాకుతున్నారా, శరీరభాగాలు వత్తిడికి గురి చేస్తున్నారా అనేది బాలికలు, విద్యార్థినిలు గుర్తించాలి, ఇలాంటి సందర్భాలలో ఎలాంటి భయాందోళనకు గురి అవ్వకుండా మన తల్లిదండ్రులకు గాని మన ఉపాధ్యాయులకు గాని విషయాన్ని తెలియచేయాలి.
వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డయల్ 100, షిటీమ్స్ 8712686056 కు పిర్యాదు చేయాలని డి.ఎస్.పి కోరారు. దైర్యం కోల్పోయి ఆత్మహత్యలు లాంటి తప్పులు చేయవద్దు అని కోరారు. విద్యార్ధిని లకు ఆకతాయిల నుండి ప్రేమ అంటూ ఇబ్బందులు వస్తాయి, సమస్యలు సృష్టిస్తారు వీటి వల్ల దృష్టి మరలకుండా దృఢ సంకల్పంతో లక్ష్యం వైపు కృషి చేయాలి క్రమశిక్షణతో చదువుకోవాలి అన్నారు.