17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

దోస్త్ రెండో విడతలో 43వేల మందికి సీట్లు

14-06-2025 01:22 AM

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) రెండో విడతలో 43,568 మంది విద్యార్థులు సీట్లు పొందారు. దోస్త్ రెండో విడత సీట్లను విద్యార్థులకు శుక్రవారం కేటాయించారు. మొత్తం 46,883 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, అందులో 43,568 విద్యార్థులు సీట్లు పొందారు. అయితే మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది నచ్చిన కాలేజీలు, కోర్సుల్లో సీట్లు పొందేందుకు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లను దక్కించుకున్నారు.

కామర్స్‌లో 13,900, ఫిజికల్ సెన్సైస్ 11,277, ఫిజికల్ సెన్సైస్ 11,277, లైఫ్ సెన్సైస్ 8,821, ఆర్ట్స్‌లో 5,032 చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 18లోగా ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్  చేయాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయని పక్షంలో సీటు కోల్పోయినట్లేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ శు క్రవారం నుంచే ప్రారంభమయ్యిందని, ఈ నెల 23న సీట్లను కేటాయిస్తామని చెప్పారు.