30-11-2024 07:06:00 PM
నిర్మల్ (విజయక్రాంతి): క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీలో ట్రస్మా ఆధ్వర్యంలో 2024 క్రీడా పోటీలను నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గంగా ఈశ్వర్ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ మా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పిఈటి లు విద్యార్థులు పాల్గొన్నారు.