26-10-2024 12:00:00 AM
అండర్-17 ఆసియా కప్
చోన్‌బురి (థాయ్‌లాండ్): ఏఎఫ్‌సీ అండర్-17 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భారత్ ఫుట్‌బాల్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం తుర్క్‌మెనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో భారత్ 1-0తో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ తరఫున రిషి (ఆట 44వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు.