calender_icon.png 12 August, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్ పర్యటనకు టీమిండియా ఎంపిక

26-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం శుక్రవారం బీసీసీఐ 18 మం దితో కూడిన టీమిండియా జట్టును ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో ఆడుతున్న జట్టును కంటిన్యూ చేసిన సెలెక్టర్లు పేసర్ మహ్మద్ షమీకి జట్టులో చోటు దక్కలేదు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసింది.

నితీశ్ కుమార్, హర్షిత్ రానా, ప్రసిధ్ క్రిష్ణలకు పిలు పు వచ్చింది. సౌతాఫ్రికాతో జరగనున్న 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేసింది. సూర్య నేతృత్వంలోని బంగ్లాతో ఆడిన జట్టు నే కొనసాగించారు. విజయ్, యశ్, ఆవేశ్ జట్టుతో చేరనున్నారు.