22-ఏ రద్దు చేయాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): 22-ఏ నిబంధన పేరుతో సామా న్యుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నా రని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆరోపించారు. మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ ప్రభుత్వ భూములు, చెరు వులు, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూము లను కాపాడటం ప్రభుత్వ బాధ్యతేనని, అయితే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్రజల భూము లను 22-ఏలో చేర్చడం సరికాదన్నారు.
తప్పుగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను సులభంగా తొలగిం చేలా పారదర్శక విధానం తీసుకురావా లని, భూ భారతి రికార్డుల్లో ప్రతి మార్పుకు డిజిటల్ ట్రైల్ ఏర్పాటు చేయాలని కోరారు. 22-ఏ పేరుతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, దళారులకు అవకాశం కల్పించడం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత 22-ఏ విధానాన్ని సమీక్షించి, ప్రజల ఆస్తి హక్కులను కాపాడే కొత్త పారదర్శక విధానాన్ని ప్రభుత్వం తక్షణమే తీసుకురావాలని గుజ్జ సత్యం కోరారు.






