15 April, 2026 | 12:06 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అభివృద్ధిలో అగ్రస్థానం సికింద్రాబాద్

04-02-2026 12:57 AM

ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ 

సికింద్రాబాద్, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో అగ్రస్థానంలో నిలుపుతున్నామని, అయితే ప్రభుత్వం తన ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగు ల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు.

అశోక్ నగర్, లలిత నగర్, శకుంతల స్కూల్, ఈశ్వరి బాయి నగర్, అంబర్ నగర్ ప్రాంతాల్లో రూ.94.20 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు, బౌద్ధనగర్ కనకదుర్గ టెంపుల్ వద్ద రూ.55 లక్షల ఖర్చుతో నాలా బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పలు సందర్భాల్లో ప్రజల ఇబ్బందులు నివారించ డంలో తాము ముందు ఉంటామని అన్నా రు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సువర్ణ లత, మాధవి, వేణు, ప్రియాం క, కార్పొరేటర్ సామల హేమ, సమన్వయకర్త రాజ సుందర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.