6 May, 2026 | 7:45 PM

Breaking News

పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •   పంటల మార్పిడి విధానాన్నీ రైతులు అవలంబించాలి   •   కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు   •  

‘ఫోన్ ట్యాపింగ్’ నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ

27-04-2024 01:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల వాదనలు విని ముగ్గురు నిందితులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం నాంపల్లి కోర్టు తిరస్కరించి కొట్టివేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణలోకి తీసుకున్నది. ఇదే కేసులో ఏ4 నిందితుడైన రాధాకిషన్‌రావు సైతం శుక్రవారం ఇదే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కు వాయిదా వేసింది.