18 May, 2026 | 3:30 AM

మొక్కజొన్న దిగుమతుల పరిశీలన

18-05-2026 02:32 AM

వేంసూర్ మే 17. ( విజయ క్రాంతి ):  వేంసూర్ మండలం కల్లూరు  గూడెంలోని మార్కెట్ కమిటీ గోదాంలో జరుగుతున్న మొక్కజొన్న దిగుమతులను  సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు  పరిశీలించారు.  ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన హమాలీల సంఖ్యను పెంచి, మొక్కజొన్న దిగుమతులను ఎలాంటి పార్టీ బేధాభిప్రాయాలు లేకుండా సీరియల్ క్రమంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అలాగే రైతులు కూడా అధికారులకు సహకరించి క్రమపద్ధతిలో దిగుమతులు జరిపించుకోవాలని, రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాక్టర్ మరియు లారీ డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, కందుకూరు సొసైటీ అధ్యక్షులు గొర్ల సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మట్టా చెన్నారావు, మట్టా ప్రసాద్, మనోహర్, ఎఫ్ సి ఎల్  గోదాం ఇంఛార్జి రోజా రాణి  మరియు సిబ్బంది రైతులు ఇతర నాయకులు పాల్గొన్నారు.