14 August, 2026 | 2:30 AM

సీతారామ పనులు వేగవంతం చేయాలి

14-08-2026 01:08 AM
  1. సాగర్ ఆయకట్టు పంటలకు నీటిని విడుదల చేయాలి
  2. జూలూరుపాడు టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి 
  3. మంత్రి ఉత్తమ్‌కు తుమ్మల విజ్ఞప్తి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (విజయక్రాంతి): సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు గురువారం సమావేశమై సమీక్షించారు. ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాలు, ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరువురు మంత్రుల మధ్య సుధీర్ఘ చర్చలు జరిగాయి. రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా పెండింగ్ పనులను వేగవంతం చే యాలని మంత్రి తుమ్మల కోరారు. 

ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భూసేకరణ, పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశా రు. కాలువల ద్వారా జలాలను అందించే బదులుగా పైప్‌లైన్ ద్వారా అందించేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. దీంతో రైతులు భూములు కోల్పోవాల్సిన అవసరం కూడా ఉండదని తుమ్మ ల వివరించారు.

జూలూరుపాడు టన్నెల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి పాలేరు జలాశయా నికి నీటిని అందించాలని, సాగర్ ఆయకట్టు పరిధిలోని వైరా, లంకసాగర్ ప్రాంతాలకు కూడా సీతారామ ద్వారానే నీటిని విడుదల చేశామన్నా రు. మరోసారి సాగునీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.  సానుకూలంగా స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ రెండు, మూడు రో జుల్లో సాగర్ ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.