14 August, 2026 | 2:30 AM

మహిళా సీఈవోలు.. 9 మందే!

14-08-2026 01:08 AM
  1. టాప్ కంపెనీల్లో మహిళలకు అరకొర అవకాశాలు
  2. మేనేజింగ్ డైరెక్టర్లుగా 25మంది 
  3. బోర్డు స్థాయిలో 860 మంది
  4. దేశవ్యాప్తంగా 11.6 లక్షల మంది మహిళా డైరెక్టర్లు
  5. లోక్‌సభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడి   

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి): దేశంలోని అగ్రశ్రేణి 500 లిస్టెడ్ కంపెనీల్లో మహిళలకు సీనియర్ నాయకత్వ అవ కాశాలు పరిమితంగానే ఉన్నాయి. టర్నోవర్ ఆధారంగా ఎంపిక చేసిన టాప్ కంపెనీల్లో సీఈవోలుగా పని చేస్తున్న మహిళలు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉండగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా 25 మంది మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కార్పొరేట్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నా, అత్యున్నత స్థానాలకు చేరుతున్నా వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గురువారం లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మంత్రి హర్ష్ మల్హోత్ర ఈ వివరాలను వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సయోని ఘోష్ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ .. దేశంలోని టాప్ లిస్టెడ్ కంపెనీల ఫైలి ంగ్ ఆధారంగా సీనియర్ల స్థానంలో ప్రాధినిథ్య మహిళల సంఖ్యను స్పష్టం చేశారు. 

మొత్తం కార్పొరేట్ రంగాన్ని పరిశీలిస్తే.. 

దేశ వ్యాప్తంగా యాక్టివ్ కంపెనీల్లో పని చేస్తున్న 39 లక్షల మంది డైరెక్టర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఇందులో 11.6 లక్షల మం ది మహిళలు ఉన్నారు. భారత్‌లో మొత్తం 21.4 లక్షల యాక్టివ్ కంపెనీలు ఉండగా, ఇందులో 5,06,000 యాక్టివ్ లిమిటెడ్ లియాబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్ (ఎల్‌ఎల్‌పీ)లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు చెందిన వి భా పడాల్కర్, అదిత్య బిర్లా క్యాపిటల్ విశాఖ ముల్యే, హిందూస్థాన్ యూనిలీవర్ ప్రాజెక్టులో ప్రియానాయర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గత సీఈవో, ప్రస్తుతం మల్టీ కమాడిటీ ఎక్చేంజ్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ప్రవీణారా య్, కోల్గేట్ పామోలివ్ (ఇండియా)లో ప్రభా నరసింహన్, డిజిట్ ఇన్సూరెన్స్‌లో జస్లీన్ కోహ్లీ వంటివారు దేశంలో ప్రముఖ మహిళా ఎండీలు,

సీఈవోలుగా కొనసాగుతున్నారు. ఆయా కంపెనీల్లో బోర్డుస్థాయి లో మొత్తం 860 మంది మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. సీఈవో, ఎండీ వంటి అత్యున్నతస్థాయి పదవుల్లో వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుత చట్టపరమైన నిబంధనలే సరిపోతాయని భావిస్తున్నందున కార్పొరేట్  నిర్వహణలో లింగ వైవిధ్యాన్ని పెంచడానికి కొత్త విధానాలు, ప్రోత్సాహకాలను పరిశీలించడం లేదన్నారు. కంపెనీల చట్టం2013లో ‘ఛైర్‌పర్సన్’ లేదా ‘చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్’ పదవుల నిర్వచనం ఏదీ లేదన్నారు. 

నిబంధనలున్నా.. వెనుకబాటు

కంపెనీల యాక్ట్  కంపెనీల రూ ల్స్ (అపాయింట్‌మెంట్ అండ్ క్వాలిఫికేషన్ ఆఫ్ డైరెక్టర్స్) ప్రకారం.. ప్రతి లిస్టెడ్ కంపెనీ, ప్రతి అన్‌లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ (రూ.100 కోట్ల పెయిడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లేదా రూ.300 కోట్లకు ఎక్కువ టర్నోవర్ ఉన్నవి)ల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను నియమించుకోవాలనే నిబంధన ఉన్నా, చాలా కంపెనీల్లో అమలు కావడం లేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

మంత్రి వెల్లడించిన గణాంకాలు  

మహిళా డైరెక్టర్లు/బోర్డు సభ్యులు  మొత్తం 860 మంది

అదనపు డైరెక్టర్లు                                 18 మంది

డైరెక్టర్లు                                         738 మంది

మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ)                       25 మంది

నామినీ డైరెక్టర్లు                                  12 మంది

పూర్తిస్థాయి డైరెక్టర్లు                           67 మంది

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో)        తొమ్మిది మంది

చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్లు (సీఎఫ్‌వో)        22 మంది