15 May, 2026 | 12:00 PM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

కొండమల్లేపల్లి బంజారా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సీత్ల పండుగ

11-08-2025 12:14 AM

దేవరకొండ: గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లాభవాని పండుగను కొండమల్లేపల్లి మండలంలోని మల్లెల గట్టు వద్దనున్న బంజారా భవన్ వద్ద కొండమల్లేపల్లి బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఆదివారం ఘనంగా సీత్ల పండుగ నిర్వహించారు. ప్రజలు, పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సంవృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని  గిరిజన నాయకులు సీత్ల భవానీకి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి బంజారా సంఘం అధ్యక్షులు రామావత్ లాలు నాయక్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ సురేష్, కొండమల్లేపల్లి ఎస్సై అజ్మీరా రమేష్ నాయక్,మల్లేపల్లి ఎంఈఓ నాగేశ్వరరావు , బంజారా సంఘం ఉద్యోగస్తులు, బావోజిలు, బంజారా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.