11-08-2025 12:14:19 AM
దేవరకొండ: గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లాభవాని పండుగను కొండమల్లేపల్లి మండలంలోని మల్లెల గట్టు వద్దనున్న బంజారా భవన్ వద్ద కొండమల్లేపల్లి బంజారా సేవ సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఆదివారం ఘనంగా సీత్ల పండుగ నిర్వహించారు. ప్రజలు, పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సంవృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని గిరిజన నాయకులు సీత్ల భవానీకి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి బంజారా సంఘం అధ్యక్షులు రామావత్ లాలు నాయక్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ సురేష్, కొండమల్లేపల్లి ఎస్సై అజ్మీరా రమేష్ నాయక్,మల్లేపల్లి ఎంఈఓ నాగేశ్వరరావు , బంజారా సంఘం ఉద్యోగస్తులు, బావోజిలు, బంజారా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.