16 April, 2026 | 7:48 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

100 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

11-06-2025 12:00 AM
  1. ముడా కేసులో 92 ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 400 కోట్లు

సహకార సంఘాలు, బినామీల పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు

బెంగళూరు, జూన్ 10: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ. 100 కోట్ల విలువైన 92 ఆస్తుల ను తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింవ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసు కున్నట్టు ఈడీ స్పష్టం చేసింది. కాగా స్వాధీ నం చేసుకున్న ఆస్తులు సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని..

ముడా అధికారులు సహా పలువురు బడా వ్యాపారవేత్త లకు బినామీలుగా ఉన్న వ్యక్తులపై ఈ ఆస్తులు ఉన్నాయని ఆరోపించింది. ఇప్పటివరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇదే ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అతని కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగ తి తెలిసిందే. 

వీరిపై 1860 నాటి భారత శిక్షాస్మృతి, 1988 నాటి అవినీతి నిరోధక చట్టం లోని వివిధ సెక్షన్ల కింద మైసూర్‌లోని లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. జీటీ దినేశ్ కుమార్ సహా మాజీ ముడా కమిషనర్ల పాత్ర అనర్హమైన సంస్థలు, వ్యక్తులకు పరిహారంగా స్థలాలు కేటాయించడంలో కీలకపాత్ర పోషించినట్టు ఈడీ వర్గాలు తెలిపా యి. అయితే విచారణ అనంతరం ఈ కుంభకోణంలో సిద్ధరామయ్య సహా ఆయన బంధువులు పాత్ర లేదంటూ కర్ణాటక లోకాయుక్త పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఏమిటీ ముడా కుంభకోణం?

ముడాకు చెందిన 3.2 ఎకరాల భూమి వి షయంలో కుంభకోణానికి సంబంధించింది. వాస్తవానికి సీఎం సిద్ధరామయ్య భార్య పా ర్వతికి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే గ్రామంలో ఈ 3.2 ఎ కరాల భూమిని బహుమతిగా ఇచ్చారు. భూ మిని ముడా సేకరించింది.

భూమికి పరిహా రం ఇవ్వాలని పార్వతి డిమాండ్ చేసింది. దీ ంతో ఆమెకు ముడా దక్షిణ మైసూర్‌లోని వి జయానగర్‌లో 14 ప్లాట్లను కేటాయించింది. ప్లాట్ల ధర సిద్ధరామయ్య ఇచ్చిన భూముల ధర కంటే ఎంతో విలువైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ భూకుంభకోణం విలువ రూ. 3 వేలకోట్ల నుంచి 4 వేల కోట్ల వరకు ఉండొచ్చని ఆరోపించాయి.