30 August, 2026 | 6:47 PM

Breaking News

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి   •   మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ   •   అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు   •   కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి   •   భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన   •   ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు   •   నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు   •   మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం   •   48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్   •   జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్   •  

అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ భేటీ

11-06-2025 12:00 AM

‘ఆపరేషన్ సిందూర్’పై వివిధ దేశాల్లో ప్రతినిధుల పర్యటన

న్యూఢిల్లీ, జూన్ 10: ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని వివిధ దేశాలకు వివరించిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధు లు తమ పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం వైఖరిని తెలియజేయడంలో వారి ప్రయత్నాలను ప్రధాని ప్రశం సించారు.

బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసా ద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే, జేడీ (యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపీ ఎంపీ సుప్రి యా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆయా దేశాల్లో పర్యటిం చి పాకిస్థాన్ తీరును ఎండగట్టారు.