24 April, 2026 | 4:45 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

రూ.45లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

12-08-2024 01:13 AM

బీదర్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తండగా పట్టుకున్న పోలీసులు

లారీ డ్రైవర్ సహా ఇద్దరి అరెస్టు

సంగారెడ్డి, ఆగస్టు 11 (విజయ క్రాంతి): కర్ణాటక నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు లారీలో తరలిస్తున్న రూ.45 లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లను  జహీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జహీరా బాద్ పట్టణ ఎస్‌ఐ కాశీనాథ్ తెలిపిన వివరాలు.. కర్ణాటకలోని బీదర్ వైపు వస్తున్న  ఓ లారీని జహీరాబాద్ పట్టణం అల్గోల్ రోడ్డు వద్ద నిలిపి తనిఖీ చేయగా సాగర్ పాన్‌మసాలా ఉన్నట్లు గుర్తించాం. వీటి విలువ సుమారు రూ.45 లక్షలు ఉంటుం దన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ అశ్రుతాలి(34), బాబులాల్ (20)తో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన జయప్రకాశ్‌ను అరెస్టు చేసి.. గుట్కాను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.