24 April, 2026 | 6:15 PM

Breaking News

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి   •   నిర్మల్‌లో ఆర్టీసీ కార్మికుల మౌన ర్యాలీ   •   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ మందుల నాగయ్య   •   ఇంటి ఆవరణ పరిశుభ్రతే... దోమల నివారణకు ఉత్తమ మార్గం   •   బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •  

రాష్ట్రంలో షాడో సీఎంలు, మంత్రుల పాలన

12-08-2024 01:12 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ర్టంలో షాడో ముఖ్య మంత్రులు, షాడో మంత్రులు పరిపాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుంకిశాల పథకం ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేసినా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టులో ఏం జరుగు తుందో ప్రభుత్వం తెలుసుకోలేక పోయిందని, మంత్రుల మాటలకు పొంతన లేదని దుయ్యబట్టారు. సుం కిశాల ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉ న్నారో సమాధానం చెప్పాలని అడిగారు. బండి సంజయ్ కోవర్టుగా మారి రేవంత్‌రెడ్డికి సహాయ మంత్రి గా పని చేస్తున్నారని చురకలంటించారు. అనంతరం ముఠా గోపాల్ మాట్లాడుతూ.. నగరంలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు. పాతబ స్తీలో రోజుకో హత్య జరుగుతున్నదని ఆరోపించారు.