5 August, 2026 | 1:54 AM

ఓవర్ లోడ్‌తో తిరుగుతున్న వాహనాల సీజ్

27-05-2024 01:03 AM

పరిగి, మే 26 : వికారాబాద్ జిల్లా పరిగిలో ఓవర్ లోడ్‌తో, ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు. తనిఖీల్లో పాల్గొన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లక్ష్మీ, కిషోర్‌లు సీజ్ చేసిన వాహనాలను పరిగి ఆర్టీసి డిపోకు తరలించారు. ఓవర్ లోడ్, రోడ్ ట్యాక్స్‌కు సంబంధించిన జరిమానా చెల్లించిన తర్వాత ఆయా వాహనాలను రిలీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.